amp pages | Sakshi

దివాలా అస్త్రంతో రూ. 83,000 కోట్లు వసూలు

Published on Wed, 05/23/2018 - 18:50

సాక్షి, న్యూఢిల్లీ : మొండిబకాయిలకు చెక్‌ పెట్టేలా కొత్తగా తీసుకువచ్చిన దివాలా చట్టం (ఐబీసీ) ప్రయోగిస్తే తమ కంపెనీలపై నియంత్రణ కోల్పోవలసి వస్తుందనే భయంతో పెద్దసంఖ్యలో కంపెనీలు బకాయిలు చెల్లించేందుకు ముందుకొస్తున్నాయి. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2100 కంపెనీలు తమ బకాయిలను చెల్లించాయి. ఇప్పటివరకూ రూ 83,000 కోట్ల బకాయిలు పరిష్కారమయ్యాయి. 90 రోజుల్లోగా రుణాలు చెల్లించకపోతే ఆయా రుణాలను ఎన్‌పీఏలుగా ప్రకటిస్తూ వాటిని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించేలా దివాలా చట్టానికి మార్పులు చేపట్టిన అనంతరం రుణ బకాయిలు పెద్ద ఎత్తున వసూలవుతున్నాయని ఈ గణాంకాలు వెల్లడించాయి.

బకాయిలను చెల్లిస్తేనే ప్రమోటర్లను వారి సంస్థల బిడ్డింగ్‌లో పాల్గొనేలా చట్ట సవరణ చేయడంతో బడా కంపెనీలు సైతం బకాయిల చెల్లింపునకు ముందుకొస్తున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. బకాయిలు చెల్లించకుండా వేలంలో పాల్గొంటే తిరిగి ప్రమోటర్లే వారి సంస్థలను భారీ డిస్కౌంట్‌తో దక్కించుకుంటారని ప్రభుత్వం వాదిస్తోంది. రుణ ఎగవేతదారులపై ఒత్తిడి పెంచడంతో బకాయిలు వసూలవుతున్నాయని, రుణాల జారీ..రుణ వితరణలో నూతన దివాలా చట్టం మెరుగైన మార్పులను తీసుకువచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Videos

చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ

కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..

సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు

ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్

అలాంటి నీచంగా మాట్లాడటం చంద్రబాబుకే సాధ్యం

మోదీ వ్యాఖ్యలకు కొమ్మినేని కౌంటర్..

అభివృద్ధిపై నాన్ స్టాప్ స్పీచ్..టీడీపీకి దమ్ముంటే..

విశాఖకే జై కొట్టిన టిడిపి

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)